అంశం : మట్టి పరిమళం
శీర్షిక : మట్టి పరిమళం
తేదీ : 01-10-2018
సంఖ్య : 69
పంచ భూతముల ప్రతి రూపమే కదా !
పావనమై నిలిచిన మానవ జన్మ.
పంచభూతముల వితరణలే కదా !
ప్రాణ పోషణకు అనుక్షణం.
సహజసిద్ధమైన సద్గుణమే కదా !
పవిత్ర ప్రేమకు తార్కాణం.
ఎండిన భూమికి మొదటి చినుకు
ఎదలు నింపును మట్టి పరిమళాలతో
రైతు సాగును ఏరువాకకు!
రమ్యమైన ప్రకృతి రంజింప.
మట్టి పరిమళాల పెట్టుబడే కదా !
తనువు పోషణకు భూషణాలు.
తదాత్మ్యం పొందని మానవుడున్నాడా ?
పుట్టి పెరిగిన భూమిని ప్రేమిస్తూ.
తరచి చూస్తే చరితలన్నీ
తప్పక దొరుకును ఆధారాలెన్నో.
నగునూరి రాజన్న
కరీంనగర్ (HYD)
శీర్షిక : మట్టి పరిమళం
తేదీ : 01-10-2018
సంఖ్య : 69
పంచ భూతముల ప్రతి రూపమే కదా !
పావనమై నిలిచిన మానవ జన్మ.
పంచభూతముల వితరణలే కదా !
ప్రాణ పోషణకు అనుక్షణం.
సహజసిద్ధమైన సద్గుణమే కదా !
పవిత్ర ప్రేమకు తార్కాణం.
ఎండిన భూమికి మొదటి చినుకు
ఎదలు నింపును మట్టి పరిమళాలతో
రైతు సాగును ఏరువాకకు!
రమ్యమైన ప్రకృతి రంజింప.
మట్టి పరిమళాల పెట్టుబడే కదా !
తనువు పోషణకు భూషణాలు.
తదాత్మ్యం పొందని మానవుడున్నాడా ?
పుట్టి పెరిగిన భూమిని ప్రేమిస్తూ.
తరచి చూస్తే చరితలన్నీ
తప్పక దొరుకును ఆధారాలెన్నో.
నగునూరి రాజన్న
కరీంనగర్ (HYD)
No comments:
Post a Comment