Friday, October 5, 2018

యుగ పురుషుని పుట్టిన రోజు- 02 -10 -2018

అంశం : పుట్టిన రోజు
02 -10 -2018
యుగ పురుషుని పుట్టిన రోజు
కవిత సంఖ్య : 70

అమ్మ అలతేరిన రోజు
నాన్న సంబరపడిన రోజు
వంశానికి వారధి అయిన రోజు
జనాభాకు ఒకటి చేరిన రోజు

అదే ప్రతివారికి పుట్టిన రోజు
ప్రతి పుట్టిన రోజు ప్రశస్తమే అందరికి.
అయినా చరిత్ర పుటల్లో నిలిచేది ఎందరికి ?
అవకాశం అంది పుచ్చుకున్న వారికే.

పరాయి పాలనలకు చరమగీతం పాడి
జాతి దాస్య  శృంఖలాలను దునుమాడి
కఠిన కారు చీకట్లను పారద్రోలి
వెలుగు రేఖలు నింపిన నాయకుడు పుట్టినరోజు

ఆసేతు హిమాచలాన్ని ఒక్క తాటిపై నిలిపి
అహింస ఆయుధంగా ఒక్క మాటగా మలిచి
ఆంగ్లేయుల పీచమనిచి పారద్రోలే
అతనిది కదా అసలైన  పండగ రోజు

జాతి మెత్తం గర్వించతగిన రోజు
జగతి హారతి పడుతున్న రోజు
పాఠ్యముషాలుగా మలుచుకున్న రోజు
మానవ విలువలు ఇనుమడించిన రోజు
అనంతమైన ఆత్మబలంతో యుగ పురుషుడైనాడు
అదే అదే మన జాతి పిత పుట్టిన రోజు

నగునూరి  రాజన్న

No comments:

Post a Comment