Tuesday, October 9, 2018

స్మార్ట్ ఫోన్ లేని రోజు

అంశం :స్మార్ట్ ఫోన్ లేని రోజు 
శీర్షిక : సాంకేతిక విప్లవం 
తేదీ : 08-10-2018
సంఖ్య : 73

మంచి చెడుల మేళవింపుల 
సమాచార చేరవేతకు 
మధురమయే కమ్మని 
నోటిమాట మతలబులు ఒకనాడు.... 

మార్పు సహజమంటూ 
జాబులు, గ్రాములు 
అలరించి అల్లరిచేసి 
అదృశ్యమాయె ఈనాడు..... 

తపాలా శాఖ ఉనికికే 
తగుదునమ్మా అంటూ 
తయారయ్యింది 
ముహూర్తం ....... 

సాంకేతిక విప్లవంతో 
ఉత్తరాన్ని హుష్ కాకిని జేసి....  
గణన యంత్రాన్ని గల్లంతు జేసి...... 
ఛాయా చిత్రాల జాడ నాతోనే....  
గ్రీటింగును నేనే..... 
మీటింగును నేనేనంటూ ....      
వెలుగు దీపము నేనే.... 
సమయసూచిని  నేనేనంటూ ... 
సరికొత్తంగ సంస్కరించుకుని 
స్మార్ట్ ఫోనై అవతరించింది..... 
జబర్దస్తీగా దూరిపోయింది
సకల జనుల జేబుల్లో ఈనాడు...... 

చేసేది లేక చేతిలో ఇముడ్చుకుని 
చల్ మోహన రంగా ....  
అంటూ కాలంతో కల్సి 
కదం కలపడమే కాని .... 
కాదని కూర్చుంటే 
కాలం చెల్లి 
చరిత్రలో కలువడమే సుమా.... 

No comments:

Post a Comment