Friday, June 24, 2011

వేములవాడ రాజరాజేశ్వర స్వామి భజన గీతం

వేములవాడ రాజన్నా
బోలాశంకర  ఈశ్వరా
ముడుపులు కట్టి మొక్కేము 
యిడుములు బాపి రక్షించుమయా

గుండములోన స్నాన మాడెదo
నిండుగ మమ్ము దీవించుమయా
అభిషేకించి అర్చించేదమూ 
ఆదరించి మము కాపాడుమయా   

అన్నపూజ తో కొలిచెదము
ఆర్తితో మమ్ము ఆదరించుమయా
కోడెను కట్టి మొక్కెదము 
కోరికలన్నీ తీర్చుమయా

మాలలు కట్టి పూజించెదము 
మదిలో నిన్నే నిలిపెదమూ
నిత్య కళ్యాణము చేసెదము 
పచ్చ తోరణమై కావుమయా        

గండ దీపమును వెలిగించెదము
మా గండములన్నీ బాపుమయా
భక్తితో నిన్ను భజియించేదము
ముక్తిని మాకు ఒసగుమయా 

No comments:

Post a Comment