Sunday, June 12, 2011

అమ్మంటే ఆత్మ స్వరూపం

అమ్మంటే అక్షరాలేనని అనుకోకు మిత్రమా 
'అ' అంటే అనుక్షణం 'మ్మ' అంటే మరువకూడనిది
అమ్మంటే ఆణువణువూ నువ్వేనని
అమ్మంటే ఆత్మేనని నమ్ము సోదరా

రక్తమాంసాలను రంగరించి రూపమిచ్చి నిలిపింది అమ్మేరా
తొమ్మిది మాసాలు తనువున మోసి తోడు నిలిచి పెంచేది అమ్మేరా
చిట్టి చిట్టి నడకలునేర్పి బుద్ధి మాటలు కూర్చి చెప్పి
దారి తెన్ను చూపించి దాపుగా నిలిచేది అమ్మేరా

అమ్మ కోపగించి తిట్టినా అవి నీకు దీవేనలేరా 
అమ్మ విసుగు చెంది కొట్టినా అది నీ క్షేమము కోరే 
అమ్మ పెంపకమే అన్నింటా అగ్రగామి 
జనం నిన్ను పొగిడినా, తెగిడినా మూలాలు వెదికి 
మరీ చెప్పుకుంటారు   ఏ తల్లి కన్న బిడ్డవోనని

పరమ విశిష్టమైన పదార్థాలు పంచి ఇచ్చే "అతిథి దేవోభవ"
అన్న సూత్రానికి అర్థాన్నిచ్చిన పుణ్యభూమి మనది
పరమత భేధమేరుగక "సర్వమతాధరనే" మన మతమ్మన్న వేద భూమి మనది
అమ్మతనం గుర్తించుటే తక్షణ కర్తవ్యం మనకు 

అమ్మ నిన్ను పెంచిన" సమయము" లో
అమ్మ నీకు పంచిన "సమయము" లో   
అవసాన దశలో అవసరమైనప్పుడు  ఆవగింజంతైనా చూపగలిగితే 
అనంతానందముతో పొంగి పోయేది అమ్మేరా 

అమ్మంటే ఆత్మ స్వరూపం అమ్మంటే పరమాత్మ రూపం 
అమ్మంటే అర్చరాది మార్గం అమ్మంటే జగద్విదిత స్వర్గం








No comments:

Post a Comment