భారత మాతా వందనం - స్వర్ణ జయంతి సంబరం
దేశ భక్తిని చాటుదాం - సమైక్య గీతం పాడుదాం
మహానుభావుల కృషి పలితం-మన స్వేచ్చాయుత భారతం
విడనాడండి భాషాతత్వం-విశ్వసించండి జాతీయత్వం
చరిత్ర పుటలు తిరగేద్దాం - జరిగిన ఘటనలు తిలకిద్దాం
ప్రాంతీయత్వం వీడుదాం - భారతీయతను పెంపొంది ధ్దాం
మంచి చేయదు మత తత్వం-మనుగడ కొరకే మానవత్వం
పెంపొంది ధ్దాం సౌభ్రాతృత్వం - భిన్నత్వములో ఏకత్వం
స్వార్థ చింతన మానుదాం - త్యాగనిరతిని చాటుదాం
భావి తరానికి సాగుదాం -సమైక్య గీతం పాడుదాం
No comments:
Post a Comment