Sunday, June 19, 2011

జన్మభూమి - యువత

జన్మభూమి జయం జయం - కర్మభూమి జయం జయం
జనని జన్మ భూమిశ్చ - స్వర్గాదపి గరీయసి

అమెరికా (చికాగో) లో ఆనాడు - అలరించాడు నరేంద్రుడు (వివేకానందుడు)
సర్వమతాల ఆదరణకు - సమాహారం మన దేశమని

ప్రపంచాన  మనదేశం - పరిణతి చెందిన ప్రజాస్వామ్యమని
పరమత సహనానికి - మనం ప్రత్యక్ష సాక్ష్యమని

గాంధీజీ అహింసావాదం - కారాదు అపహాస్యం
కావాలి ముందు తరానికి- కమ్మనైన మార్గదర్శకం

బడానేతల రాజకీయాలకు - దళారీల స్వార్థపరత్వానికి
బలి కారాదు సామాన్యుడు-పూరించాలి యువత శంఖం

వందే మాతర గీతం - నాటి సమర శంఖారావం
వణుకు పుట్టించింది - నాటి బ్రిటిష్ పాలకుల్లో

రవి అస్తమించని బ్రిటిష్ పాలననుండి - రక్షించారు నిస్వార్థ నాయకులూ
రావాలి అలాంటి యువ నాయకులూ - రక్షించాలి నేటి సమాజాన్ని

జన్మ భూమి జయం జయం - మన వేదభూమి జయం జయం

No comments:

Post a Comment