Saturday, July 2, 2011

అగ్రదేశం-ఉగ్రవాదం

వలస దేశాల పరిపాలనలతో - విసిగి వేసారిన అమెరికా
సాగించెను పోరాటం - సాధించెను స్వాతంత్ర్యం


అనతి కాలం లోనే వినుతికెక్కి -అవనిలోనే అచ్చెరు వొందే విధంగా
అభివృద్ది సాధించిన అమెరికాకు సైతం - ముసురుకున్నవి ముష్కరుల నీలి నీడలు


కుంజర యూధమ్మున కుత్తుక - దోమ జొచ్చిన విధంబుగా
అమెరికా వారి అధికార దర్పం సైతం- ఆడలేక ఓడినట్టయింది ఒక్క క్షణం


వరల్డ్ ట్రేడ్ సెంటర్లు  - పెంటగాన్ సౌదమ్ములు
పెడరెక్కలు విరచినట్లు - పెర పెర లాడి మిన్నకుండెను


అరాచకాల ఆగడాలకు - కుప్ప కూలెను ఆకాశ హార్మ్యాలు
దట్టమైన ధూళి దుమ్ముతో - దద్దరిల్లెను జన సమూహం


ఉగ్రవాదుల ఊచకోతకు - ఉక్కిరి బిక్కిరి ఆయెను జనావళి
ఆధునిక రాడార్లు సైతం - అచేతనమాయెను ఆ క్షణం




సెప్టెంబర్  .౧౧  వార్తలు చూసిన వెంటనే వ్రాసుకున్న కవిత

No comments:

Post a Comment