Thursday, June 23, 2011

అభయ ప్రధాత- సాయి (కీర్తన)

సాయి దేవా నమో నమో - సర్వ వినుతా నమో నమో
షిరిడి వాసా నమో నమో - చిద్విలాసా నమో నమో

నిర్మలమైన నీ చిరు నగవు- నిర్భేధ్యమైన హిమ నగము
శ్రద్ధ సబూరి నీ నిలయం - సమర్థ సద్గురు సాయి నామం

కోమలమయిన నీ రూపం - కోటి కాంతుల ప్రభమయము
భవ్యమైన నీ రూపం -భక్తులకెంతో ప్రమోదము

సాటి మనిషిని చల్లగ చూసి - సౌభ్రాత్రుత్వము చాటినావు
సన్నిధి నీవై పెన్నిధి నీవై- సన్మార్గమున నడిపించావు

మాతృ మూర్తుల మరిపించే-మమతా సమతలు చాటినావు
చూపులలోన కరుణ నింపి - దారి చూపి గురువైనావు

ఆత్మను నిలిపి అంకితమౌతే - అభయ ప్రదాతగా నిలిచావు
అడగక ముందే అన్నీ ఇచ్చి - ఆది దేవుడవు అయినావు

ఆది తెలియదు అంతు చిక్కదు - అక్షయమైనది సాయి నామం
అనంతమైన మహిమలను - అవలోకించే ఆర్తిని ఇమ్ము

సాయి లీలలు సమస్తము - సాయి మహిమలు సమున్నతం
ఆధ్యాత్మికతను జోడించి - జ్ఞ్యాన మార్గమున నడిపించావు

బందం నీవే పాశం  నీవే - పాత్ర దారులం మేమంతా
బ్రతుకు గమ్యం నిర్దేశించు-పారమార్థం ప్రభోదించు

కష్టములందు మరువకుండగా - కల కాలం మా మనసున నిలిచి
కాచి మము రక్షించుమయ్య- కరుణా మూర్తివై కాపాడుమయ్యా

No comments:

Post a Comment