Thursday, June 23, 2011

వాసవీ మాత - భజన గీతం

వాసవాంబ నమో నమో - 
కన్యకాంబ  నమో నమో
వరకుమారి నమో నమో - 
కుసుమ తనయా నమో నమో         // వాసవాంబ//


కుసుమ దంపతుల కూతురివై - 
కూర్మి నిలయ దేవతగా     
కదలి వచ్చిన కల్పవల్లి - 
కామాక్షిగ కరుణించమ్మా              // వాసవాంబ//


ఆదిశక్తి అంశతో నీవు - 
పునర్వసు నక్షత్రాన
ధరణిలోన వాసవిగా - 
దర్శనమిచ్చిన ఓ మాత               // వాసవాంబ// 


విరూపాక్షుని సోదరివై - 
ముల్లోకాలకు జగన్మాతగా
విష్ణువర్ధనుని   వధియించి -
ముక్తినోసగిన ఓ మాత                  // వాసవాంబ//    

అతివలన్న అబలలు కాదని 
అధముల పీచము అనచంగ 
అహింస కూడా ఆయుధమేనని 
అవనికి చాటిన ఓ మాత           // వాసవాంబ//  


మహిమాన్వితం నీ అవతారం-
నీ మహిమ తెలియగ మేమెంత
కారణ జన్మము నీ ఈ రూపం-
కాత్యాయనివై కరుణించమ్మా   // వాసవాంబ//


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment