Monday, June 13, 2011

మాతృ సంస్థ ఎన్ టి పి సి అన్లిమిటెడ్

పట్టాలు పుచుకుని పరుగున వచ్చిన మనకు 
పదే పదే ప్రశిక్షనలిచ్చి ప్రతేక స్థానమిచ్చి నిలిపింది.
గేటెడ్ కమ్యూనిటీలో సేక్యుర్డ్ జీవితాలనిచ్చి,
సంఘంలో స్టేటస్ ఇచ్చి, సంతృప్తిని నింపింది.

కన్న తల్లి తండ్రులను, కట్టుకున్న ఇల్లాలును,
కని పెంచిన పిల్లలను సదా కనిపెడుతూ నిలిచింది.
అత్యవసరాలకు ఆదుకుని, అవసరాలన్నీ తీర్చింది
చదువిలిచ్చిపిల్లలకు సంస్కారాలు నేర్పింది .

పండగలకు, ఫర్నీచర్లకు,కంప్యూటర్లకు,
బండ్లకని, ఇండ్లకని  భలేగా అద్వాన్సులిచ్చి
బ్రతుకంతా బాధ లేకుండా ఓ ఇంటి వాణ్ణి చేసింది.

థర్మల్ పవరుతో మొదలెట్టి, హైడల్ పవరును అక్కున చేర్చుకుని
గాలి మరలు మొదలుకుని, సోలారును అందుకుంది.
అటమిక్ లో అడుగిడి, ముందు వెనుక నేనేనంటూ 
కోల్ వాషరీస్, ఫ్లై అశ్లు మరియు పవరు సేలులో సైతం దూకింది.
రైల్వేలతో పొత్తు కుదుర్చుకుని, రక రకాల డైవర్సి ఫికేసన్ కు   సై అంది 
సలహాల సర్వీసులో సైతం సగర్వంగా నిలిచింది.

విఫనిలోని సంస్థలన్నీ కుదేలయ్యి రోదిస్తుంటే 
తబ్బిబ్బులకు తావివ్వక తమాయించుక నిలిచింది .
ఆర్థిక మాంధ్యములో కూడా అతలాకుతలము కాకుండా 
కొండంత అందనిచ్చి మనను, వాటా దార్లను కాచుకుంది.

సాదాగా వచ్చిన మనందరిని సంపూర్ణముగా తీర్చి దిద్దినది
అంతరాత్మను సృశించి అంతర్ముఖుడవై గమనించు సోదరా
 కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి పుంజము మాదిరి 
కర్మగారమై వెలసినా మనందరికిదే పవిత్ర దేవాలయము మిత్రమా












No comments:

Post a Comment