కాలానుగుణముగా వచ్చే భౌగోళిక ఊష్ణ శీతలములకు
కలుగును మార్పులు మన మేని ప్రవృత్తుల యందు
కనువిప్పుతో ఆచరించె నాడు మన ఆర్యులు
కాచుకొనుటకై వివిధ శాస్త్రీయ విశిష్టములనెల్ల
ఆచరించిన పద్ధతులెల్ల ఆనవాయితీగ వచ్చె
అవి ఎల్ల నిలిచె తదనంతరం ఆదిగాగల పండుగలై
ఆయణం మలుపు నందు ఆచరిస్తున్నదే మనమంతా
ఆవిష్కృతమైనది ఈ మకర సంక్రమణంగా (సంక్రాంతి).
ఉరుకుల పరుగుల పట్టణ జీవితాలకు
ఊసురోమని ఊడ్చ పది అడుగుల జాగా లేదు
ఊర పావురం గూళ్ళ మర బతుకులలో
ఉన్న వాకిట ముగ్గుల రంగులు కానరావు
పల్లె ప్రేమలకు సమయం లేదు
పలుకరింపులకు మనసు నిలువదు
సెల్లు జీవితాన ప్రవేశించినది మొదలు
సేదదీర బ్రతుకు వేగమున వడి పెంచినది
ఆడా మగ తేడా లేక చదువుల బడికై
పల్లె జనం సైతం పట్నం బాట పట్టుచుండె
బతుకు పోరు బాటలో
ప్రపంచ దేశాలు చుట్ట బట్టె
దేశ భాషలందు తెలుగు లెస్స
వేష భావములందు తెలుగు సంస్కృతి మిన్న
భవ బంధములు తెలుప తెలుగు వాడే గొప్ప
విశ్వ దేశములందు విలసిల్లు చుండ
ఉమ్మడి కుటుంబాల ఊసులుండయి కానీ
ప్రాణమిచ్చే మిత్రులకు కొదువ లేదు ససేమి
బంధు మమకారం దొరకదేమో కానీ
బాగు చెడులకు గూగులమ్మ ఉండనే ఉన్నది
రంగు రంగుల ముగ్గులన్నీ రమ్యమై దొరికే స్టిక్కర్లుగా
సకినాలు, అరిసెలు స్వగృహ ఫుడ్స్ నుండె విరివిగా
సంక్రాంతి సంబరాలేమో సాదృశ్య దూరవాణి యందు
సాదరముగ సమకూరె ధరలోన సమస్త తెలుగు వారందరికీ
సందడి ఈ పండుగ నేడు సవివరమై తెలియంగ
No comments:
Post a Comment