తెలుగమ్మా
నీ ఉనికేల నిలుచునమ్మా
తెలియజెప్పి
పాలకులకు నిలువమ్మా.
భాష బ్రతకాలంటే ముందు మనిషిబ్రతకాలి
మనిషి బ్రతకాలంటే మానవత్వం బ్రతకాలి.
పాలకులు, అధికార్లు పంచుకుంటే కాదు
పది మంది బ్రతకాలనే పరితపన
కావాలి.
రైతుల
యాతనలు, చేతి వృత్తుల బాధలు
తీరి,
ఎవుసం కూలీల వలసలు నిలవాలి.
.
పల్లె బతుకుల్లో వెలుగులు నింపే
పట్నం పోకడ కలిగిన బాటలు
కావాలి.
అధికారంలో
ఉన్నవాళ్లు అంధకారంలో ఉండరాదు
మత వాదం మాసిపోయి మానవ
హిత వాదం పెరగాలి.
.
తాతల, తండ్రుల పేర్లు చెప్పి
గడువు కాలం గడపరాదు
మాయ మాటల గారడీలు మాని,
చేతల పాలనలతో చేయూతనివ్వాలి.
విద్య, విద్యుత్తు,రోడ్లు,ఆరోగ్యం,సంక్షేమం
వివిధ మౌలిక వసతులు విరివిగా
అందించాలి.
అప్పుడే కదా మానవాళి
పరిమళించు
అవును
మన తెలుగు భాష గుబాళించు
No comments:
Post a Comment