కల్లా కపటం తెలియదు మా
పల్లె జనానికి
అరమరికలు
లేకుండా అన్నతమ్ములోలె
కల్సి ఉండేటోల్లం మా పల్లె మాకు తల్లి లాంటిది
మమతా సమతలతో బ్రతుకు బాట నేర్పింది
కల్సి ఉండేటోల్లం మా పల్లె మాకు తల్లి లాంటిది
మమతా సమతలతో బ్రతుకు బాట నేర్పింది
ఆమడల దూరాలైన అరికాలి ప్రయాణాలే
ఆనాడు
ఎడ్లబండ్లు
కట్టుకొని ఊర్లకెల్లి వచ్చింది
ఎర్రబస్సు ఎక్కి ఎములాడకు పోయొచ్చింది
గుర్తుకొస్తున్నాయి ఒకటొకటిగా
ఎర్రబస్సు ఎక్కి ఎములాడకు పోయొచ్చింది
గుర్తుకొస్తున్నాయి ఒకటొకటిగా
బంధువుల
సైకిలోస్తే బతిమాలి తీసుకున్నది
పల్లెకు
మోటారు సైకిలో... జీపో
వస్తే ...
పడి పడి చూసేటోల్లం
- పరేషాన్ అయ్యేటోల్లం
గుర్తుకొస్తున్నాయి ఆనాటి సంఘటనలు
గుర్తుకొస్తున్నాయి ఆనాటి సంఘటనలు
పెద్ద పెద్ద వానలకు మత్తల్లు
దునుకుతుంటే
గమ్మత్తుగ చూసి చూసి ఈతలు నేర్చుకున్నది
గోటీలు, బొంగరాలు ఆటలతో గింగిరాలు తిరిగింది
కబడ్డీ, చిర్రగొనెలాడి కొట్లాటలు పెట్టుకున్నది
గుర్తుకొస్తున్నాయి చిన్ననాటి చిలిపి పనులు
గమ్మత్తుగ చూసి చూసి ఈతలు నేర్చుకున్నది
గోటీలు, బొంగరాలు ఆటలతో గింగిరాలు తిరిగింది
కబడ్డీ, చిర్రగొనెలాడి కొట్లాటలు పెట్టుకున్నది
గుర్తుకొస్తున్నాయి చిన్ననాటి చిలిపి పనులు
ఒర్రె,
వాగు వంకల్లో నిలిచి
ఉన్న నీళ్లను
యాతమేసి, గూడవేసి, పంటచేన్లక పెట్టింది
మోటగొట్టి నీళ్లు వరిచేన్లకు పెట్టింది
గుర్తుకొస్తున్నాయి ఆనాటి రోజులు
యాతమేసి, గూడవేసి, పంటచేన్లక పెట్టింది
మోటగొట్టి నీళ్లు వరిచేన్లకు పెట్టింది
గుర్తుకొస్తున్నాయి ఆనాటి రోజులు
దుక్కి
దున్ని ఇడుగు,
ఇరువాలు జేసి
మూడ్సాలు,
గొర్రొప్పి నాట్లు
వేసి
కలుపులు
తీసి, స్వచ్చమయిన ఎరువులతో
పంటలు పండించిన ఆనాటి విధానాలు
గుర్తుకొస్తున్నాయి
జపాన్ ఎరువులంటూ ఉపాయంగ వచ్చినయి
రకరకాల
కల్తీ, కాలుష్యాలతో కాసారాలై
మానవాళి మనుగడకే ప్రశ్నార్థకమై నిలిచినయి
ఈనాడు గుర్తుకొస్తున్నాయి - తొలి నాల్ల రసాయన ఎరువులు
మానవాళి మనుగడకే ప్రశ్నార్థకమై నిలిచినయి
ఈనాడు గుర్తుకొస్తున్నాయి - తొలి నాల్ల రసాయన ఎరువులు
కూలి నాలి కోసం జనం
పడిన అగచాట్లు
నగదు పైసలకోసం నాడు పడిన
కష్టాలు
కారం నాలుకపై అద్దుకొని , కడుపు నీళ్ళతో నింపుకున్న వైనం
కారం నాలుకపై అద్దుకొని , కడుపు నీళ్ళతో నింపుకున్న వైనం
ఆనాటి కష్ట విషయాలు
గుర్తుకొస్తున్నాయి.
ఉద్యోగిని
చూస్తేనే ఉల్లికి పడ్డ జనాలు
సూటి పోటీ మాటల్తో చిన్న
సూపు చూసేటోల్లు
మరచిపోలేని మచ్చ కలిగిన ముచ్చట్లు
బండ్లు ఓడలై , ఓడలు బండ్లైన బ్రతుకుదెరువులు
ఆనాటి విషయాలు గుర్తుకొస్తున్నాయి -
మరచిపోలేని మచ్చ కలిగిన ముచ్చట్లు
బండ్లు ఓడలై , ఓడలు బండ్లైన బ్రతుకుదెరువులు
రెక్కాడితే
కానీ డొక్క నిండని
నాటి
లెక్కలు
ఎక్కడికి సరిపోతాయి ఈనాడు
ప్రభుత్వం
కల్పిస్తున్న పనికి
ఆహార పథకాలతో
మీసం మెలేసేటొల్లె గాని - ఎవుసం కూలి చేసే ఆసామే లేడు మన పల్లెల్లో ఈనాడు
మీసం మెలేసేటొల్లె గాని - ఎవుసం కూలి చేసే ఆసామే లేడు మన పల్లెల్లో ఈనాడు
రేడియోలు,
వార్తాపత్రికలు లేని నాటి రోజుల్లో
పక్కూరు ముచ్చట్లు కూడ పదిరోజులకు తెల్సేవి
ఏబదేండ్ల కాల ప్రయాణంలో ఏర్పడిన మార్పులెన్నో ల్యాండ్ ఫోనుంటేనే రారాజు ఆనాడు ప్రపంచమే అరిచేతిలో అనే స్మార్ట్ఫోన్ లేని మనిషి లేడు ఈనాడు
పక్కూరు ముచ్చట్లు కూడ పదిరోజులకు తెల్సేవి
ఏబదేండ్ల కాల ప్రయాణంలో ఏర్పడిన మార్పులెన్నో ల్యాండ్ ఫోనుంటేనే రారాజు ఆనాడు ప్రపంచమే అరిచేతిలో అనే స్మార్ట్ఫోన్ లేని మనిషి లేడు ఈనాడు
పోస్టల్
కార్డు, ఇన్లాండు లెటర్లు కాకుండ
అత్యవసర మతలబులకు- వింతైన తంతి విధానమే శరణ్యం ఆరోజుల్లో వారెవ్వా
అనే వాహనాల సౌకర్యం
ఆపసోపాలు లేని హార్వెస్టర్ల కల్టివేషన్
విధానాలు టీవీ లు , ఇంటర్నెట్,
facebook మొదలగు సోషల్ మీడియాలతో
అప్డేట్ అయినమనుకుంటున్నారు గాని అవలక్షణాలెన్నో పొంచి
ఉన్నాయి మిత్రమా
ఆదమరిచి అడుగులేయాలి నేస్తమా
ఆదమరిచి అడుగులేయాలి నేస్తమా
No comments:
Post a Comment