మనిషి సంఘ జీవి
మాట తోనే మనుగడ
మన మనుషులు, మన భూమి
, మన భాష తనివి
తీరనివి
అమ్మ భాష ఆనందం
అనుభవిస్తే అనంతం
మాతృ ప్రేమ తెలుపంగ అలుగులై
పారే జీవ గంగ
పల్లె పడుచు పాటల్లో పిల్ల
పాప ఓల లాడ
శివ సత్తు ల బోనమోలె
అవనియందు దైవమోలె
సంకురాత్రి
సంబురమోలే అంబరాన వెదజల్లు
సద్దుల బతుకమ్మ లోలె సుద్దులెన్నో
తెలియజేయు
అంది వచ్చిన పసిడి పంట
వోలె
అల్లుండ్లు
ఇంటికొచ్చిన పండుగోలె
పంటకాడి రైతన్నలకు దిశ చూపే
గోరుకోయలు
, మూల సుక్కోలే
ముత్యమంటి
అక్షరముల ముద్దులొలుకు భాష
చిరు పదాల పొందికలతో పెరియ
ఆనందాలు వెదజల్లు
వడి తెలిసిన కవి కులానికి
ఒడి నింపే మాతృ
మూర్తి యై నిలిచే
అమ్మ భాష ఆనందం
ఆస్వాదిస్తే అనంతం
అదే కదా మన
తెలుగు భాషా సొంతం
No comments:
Post a Comment