పంచ వర్ష ప్రణాళికలు
ప్రగతిపథానికి
సోపానాలు ఆ నాడు
మసి పూసిన మతలబులు
ముసి ముసి నవ్వుల ముచ్చట్లు
ఈనాడు
భోఫోర్సుల
కొనుగోళ్లు మొదలుకుని
గడ్డి వాములు, భూముల బదలాయింపు,
బొగ్గు క్షేత్రాల కేటాయింపులు,
ఇల్లు, ఆటలు ఇవీ, అవీ
అనే బేధం లేదు
ధ్వని తరంగాల వంతు వచ్చేసరికి
లక్షల కోట్లు దారి మల్లినాయని
సాక్షాత్తు
కాగ్ కాచి వడ బోసి
వల్లె వేసింది
సి బి ఐ
వాళ్ళు సైతం సిన్సియర్ గా
చెప్పిండ్రు ఆనాడు
మచ్చ లేని విచారణతో మలినం
కడిగేసుకుందామని
మాన్యుల అమాత్య పదవి ఆటంకం
కాకూడదని
మౌనియైన
మన ప్రధానమంత్రి తప్పించారు సాక్షాత్తు గ
ఆనక
వత్సరము నిర్బంధములో నిలిచారు.
సామాన్యుల
సంపద దోపకమయ్యి
మాన్యుల దొంతరలు నింపకమౌతున్నది
లక్షలు
కాదు కాదు కోట్ల
కోట్ల కుంభకోణాలతో
వంద కోట్ల జనాలను వంచిస్తూనే
ఉన్నారు
మసి బూసి మారేడు కాయలను
చేశారు
ముసి ముసి నవ్వులతో మాధ్యమాల
ముందుకొచ్చారు
ముసురుకున్న
పకడ్బందీ ఆరోపణలన్నీ
ముడుచుకుని
సిగ్గుతో తల వంచుకున్నయి.
కళ్లుండి చూడలేని న్యాయ వ్యవస్థ
చూడగలిగి కళ్ళు మూసుకున్న రక్షణ
వ్యవస్థ
అన్నీ ఉండి అచేతనమౌతున్న అధికారగణం
ఐదేండ్లు
ప్రజలేమి చేయలేరనుకునే నాయకుల ధీమా
అనన్య సామాన్యమైన రాజ్యాంగం ఉండి
అంతు లేని పకడ్బందీ చట్టాలుండి
ఆరోపణలు మోపిన కాగ్ వారిదా
అధికారాలన్నీ
ఉండి అచేతనమైన గణాలదా
రైతులకు మద్దతు ధరాలివ్వాలన్నా
రైల్వేలలో
సరైన రక్షణ వ్యవస్థ
చేయాలన్నా
దేశ సరిహద్దుల్లో దేహ బాధలను
మరిచి సేవలందించే సైనికులకు
దేశ సంపద పెంచి విరమణ
పొందిన శ్రామికులకు
దైనందిన
భత్యాలకేమో సవాలక్ష పరిమితులు.
ఎన్నుకుంటూ
పోయే వెర్రి ప్రజలకు
మిన్నకుంటున్న
అధికారుల వలన
తన్నుకుంటూ
పోయే రాజకీయ నాయకులు
ఎన్నటికి మారునో ఈ నై
జం, ఎప్పుడు బాగుపడునో
ఈ దేశం
No comments:
Post a Comment