ప్రపంచ తెలుగు మహా సభలు
2017 ను
ప్రచండ విజయముగా జరిపించినారు
తెలుగు భాషా పండుగను తెలియ
జేసిరి నిండుగా
తెలుగు ప్రేమికులంతా పాల్గొనగా తెగ పొగిడిరి జగమంతా
పద కవులు, పద్య కవులు,జనకవులు, వాగ్గేయులు,
కథల, నవలల రచయితలు
పలు సమ్మేళన, సదస్సులలో
కడు రమ్యముగా పాల్గొని పండించిరి.
అష్టావధానం,
శతావధానం లే కాకుండా
నూతనాధ్యాయానికి
శ్రీకారం చుట్టి ఆదరించిరి
అంగుష్టావధానం,నేత్రావధానం, అక్షర సంఖ్య అవధానం
అచ్చెరువొంది
ఆనందించిరి తెలుగు భాషాభిమానులు,
కంద పద్య మూలాలను కని
వెతికి
కనుల పండుగగా తెలియజేసిరి
అస్మాక జనపదం, ఆటవెలదులు
ఇచ్చొటనే ప్రస్ఫుటమైనవని దఖలుపరిచిరి.
ఆది కవుల భాషాభిమానం యాదిలో
అనేకానేక ఆధారాలను ప్రస్తుతించిరి
ఆనందించిన
ప్రముఖులంతా
ఆలోచించిరి
చరిత్ర తిరగ రాయడానికై
మనిషి మనుగడలో శ్వాస తదుపరి
అన్నం, నీరు ప్రథమం
ఆఛ్చాదన, ఆవాసం ద్వితీయం
భాష, భావం తృతీయం- అన్నీ
కలిస్తేనే సంస్కృతి
తెలుగంటే భాష మాత్రమే
కాదని
పండగలు, పబ్బాలు , ఉత్సవాల ఉనికిని
చాటి
నృత్యాలు,
గీతాలాపనలు, కవులు,నటులు ఆదిగాగల
అందరిని సన్మానించి ఆదరించారు.
ఆహార్యము,
నటనలే కాకుండా
ఆహారపు అలవాట్లను సైతం
అంది పుచ్చుకున్నట్టు అందించారు
అందరి ప్రశంసలు అందుకున్నారు.
విద్య, వినయం; పట్టు, విడుపుల కలబోతలతో
విశిష్టమైన
వ్యక్తిత్వం సంతరించుకున్న వినయశీలి
మన ముఖ్య మంత్రి , నాయక,
అధికార గణం
ముదమారా
జరుపుకున్న ప్రపంచ తెలుగు మహా
సభలు 2017 తో
ముత్యమై నిలుచు భాష పండుగ
చరిత్రలో ఘనమై నిలువ
No comments:
Post a Comment