అమ్మ నాన్నలన్న ఆలంబనలు తగ్గ
ఆశ్రమాలు పెరిగె ఆదరించ వృద్ధుల
అవనిలోన
వావి వరుసలు మరువ (వా)
నరులు
వనితలెందరో
బలి వసుధలోన
పాప భీతి మరువ వ్యాపార
దళారులు
కల్తీల విచ్చు కత్తులు కమ్ముచుండె
ప్రజారోగ్యమున
విచ్చలవిడి
మత్తు పానీయములతో
రక్త సిక్త విహాంగాలాయె రహదారులెల్ల
వైద్యము చాటున వ్యాపారము చేయుచు
నిత్యం దోపిడీ నారాయణులయ్యిరి
కంటకింపు కలిగిన కవ్వించుచుండిరి
కావరమెక్కిన
ఇరుగు పొరుగులు
అందలమును అలంకరించిన అధికారగణం
అందవు సర్కారు సత్ఫలితములు ఆఖరు
వ్యక్తికి
కడకు కరుకు తగ్గిన కఠిన
శిక్షల వలన
న్యాయాధీశుల
నడుమ నగుబాటు పొడసూపే
యథా రాజా తథా ప్రజా
అన్నట్టు
మేలిమి జాతి నాయకులకై అంజనమేయలేమో
నీతి కలిగిన జాతి నేటికీ
ఏదంటే
సరిహద్దు వెంట పహారా కాసే
సైనికునిదంట
ఆత్మ హత్యలనైనా ఆలింగనం చేసుకుంటూ
అన్నపూర్ణను
అందిస్తున్న అరక స్వామిదేనంటా
ధర్మం నాలుగు పాదాలంటే మానవతనే
మిత్రమా
అది మరచిన ఏలికలకు అధో
గతే ఈ జగతిన
No comments:
Post a Comment