నగునూరి రాజన్న
ప్రపంచం మెచ్చిన భారతీయం
తేది: 04-05-2020
శీర్షిక: ఆత్మ సాక్షిగా ఇది నిజం...
సంఖ్య: 409
భారతీయతంటే ఏమని చెప్పేది ?
పరాయిల పాలనలలో పాశ్చాత్యపు మోజులో
పది తరాలు దూరమైన వేదాలు,
ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు,
భగవద్గీత,రామాయణములని చెప్పనా....!
భారతీయతంటే ఎవరిని చూపించేది ?
పదే పదే పదిహేడు సార్లు క్షమించి
ప్రాణం తీసుకున్న నాటి రాజునా....!
ఒక చెంపమీద కొడితే రెండో చెంప
చూపమన్న స్వాతంత్ర్య సమరయోధున్నా...!
భారతీయమంటే ఎలా చెప్పను ?
ప్రత్యేక బోధనలు ఉన్నా లేకున్నా ప్రతివారిని
ఆదరిస్తూ చేసే గొప్ప నిత్య జీవన విధానం
మాత్రమేనని చెప్పనా.......!.
భారతీయమంటే ఏమని చూపను?
అరకొర కుక్కమూతి పిందెలు అరిచినా,
బంగారమోలే కలిసికట్టుగా బతుకుతున్న
హిందూ, ముస్లిం,సిఖ్, పార్సీ, బౌద్ధ,
జైన మతస్థులనని చూపనా.....!
పరుల మేలోర్వని పచ్చి నెత్తురు మరిగిన
పంతపు తీవ్రవాదులు ప్రశ్నిచడం తప్ప ....
మన:సాక్షిగా మననెరిగిన తక్కిన విశ్వమంతా
మనసునిండా మల్లెల నీరాజనాలే.....!
ఆత్మ సాక్షికి అంతకన్నా ఇంకేం కావాలి?
నగునూరి రాజన్న
కరీంనగర్
No comments:
Post a Comment