సంపద కేంద్రీకృతమయ్యే స్వామి కార్యాలు,
సరిహద్దులు దాటించే దారిద్య్రపు సంస్కృతుల
సుడిగుండాలలో తాము, తమ వారు సైతం
సావాసులమేనన్న సత్యమెప్పుడు గుర్తిస్తారు (లంచగొండి అధికారులు )
అత్యధిక ఉపగ్రహాలు అనుసంధానించి
అంతరిక్ష శిఖరాగ్రాలు అధిరోహించడమే కాదు
అధ : పాతాళానికి కూడా చేరువయ్యాము
అన్నపూర్ణనందించే రైతన్నలపై లాఠీలు ఎత్తి
పొరుగు క్షేమం పొందు లాభం కోరే
పొల్లు పోనీ ఘన పాలకులుంటే ఏమి లాభం
సొల్లు కార్చే లంచ గొండి తనంతో
ఇల్లు గుల్ల చేసే వల్లమాలినోల్లుండగా
ప్రకృతి ఒడిలోనే ప్రజల శాంతి వెదికి నిలిచే
పరమ వీర జవానులకేమో లెక్కలేసిన జీవన భృతులు
పదవి ఒక్క సారి వెలగ బెట్టిన పాలకుడైతే చాలు
పంచుకుంటున్నారు కోట్ల అలవెన్సులు జీవితాంతం.
పేదల పెన్నిదైన రైలు ప్రయాణాలు
ప్రజల గుండెల్లో పరుగెడుతున్నవి రక్షణ కరువై
పరిమితి మించిన ప్రమాదాలు జరిగినా
పని తీరులో పరిణతి పెంచుకోలేక సతమతమౌతూనె ఉన్నాము
పెద్దనోట్ల రద్దుతో ముద్దైన నల్ల ధనం మాటేమోగాని
నగదు కొరతైతే నానాటికి లభ్యత లేనే లేదు
పన్నులన్నీ ఏకీకృతమంటూనే జి ఎస్ టి తెచ్చారు
పరోక్ష పన్నులనేకం పెంచి బాదుతూనే ఉన్నారు ప్రజల నెత్తి పైన
పరుగున రావమ్మా విళంబి
పావనమై నిలువమ్మా సాధారణ పౌరునికి
హేవళంబి లోని విళంబాన్ని తీర్చుతూ
హెచ్చులెరుగని పౌరుని కోర్కెల చిట్టా
No comments:
Post a Comment