అర కొర స్వాతంత్య్రం ఆడవాళ్లకు
అవతలింటి ఆడపడచంటేనే అందరికి లోకువ
అసూయ చెందుతారు సాటి మనుషులు
ఆటంకాలతో అణిచివేత ప్రయత్నాలు చేస్తారు
పల్లె పడతికి సరైన సౌకర్యాలే లేవు
పట్నం పడతికి పౌర సహాయం దొరకదు
పడీ.... లేచి.... ఓ పదవి వెలగబెడుతుంటే
పక్క వాళ్ళే పగలు పెంచుకుంటారు
ముప్పయ్యారు జుట్లు జట్టుగుంటాయి కానీ
మూడు జడలు కలువవనే సామెత లా
మగవాళ్ల విషయం పక్కన పెడితే
మగువల ఆరాటం ముందు సాటి మగువలు గుర్తించాలి
పడతులు విద్యావంతులైతే
పండంటి కాపురాలు బలపడుతాయి
పరిణతి కలిగిన సంఘమేర్పడి
ప్రయోగ యుక్తమైన దేశంగా అభివృద్ధి చెందుతుంది
అమాత్య పదవులేం కాదు
అసలు MP,MLA,MLC లు కూడా కాదు
ఆఖరుకు వార్డు మెంబరు కావాలన్నా
ఆరక్షణ శాతం వర్తించాలంటున్నారు
అనేక సేవా రంగాలలో ఆరి తేరి నిలిచారు
అనన్యమైన సేవలందిస్తూనే ఉన్నారు
అష్ట కష్టాలు పడి అంతర్జాతీయ క్రికెట్టు గెలిస్తే
ఆదరించండని అడుక్కోవాలా.. ఇదెక్కడి న్యాయం
రామ రాజ్యంగా రంజిల్లాలంటే
గాంధీజీ కలలు సాకారం కావాలంటే
కొసరి వడ్డింపుల కొనసాగింపు కాదు
అసలు వాటా అర్ధ శాతం ఆడకముందే ఇవ్వాలి....
No comments:
Post a Comment