Sunday, July 31, 2011

శ్రీ సాయి శరణాగతి కీర్తన

సాయి నామం సర్వ మోదం - సాయి ధామం పాపహరణం 
ద్వారకామాయి పుణ్యస్థలిగా -దర్శనమిచ్చి దరిచేర్చావు

ఫకీరుగా పిలిపించుకుని - పామరులను సృశించావు 
బడబాగ్నులను హరియించి- మనోవేదనలను తీర్చావు

పాముకాటు,చెవి పోటు- అంతు చిక్కని అనారోగ్యాలను సైతం 
వాక్కు దృ ఢత్వంతో శాసించి - వ్యాధులన్ని నయం చేసావు

కపటం లేని కర్మలాచరించే -ఆధ్యాత్మికతను అందుకోమని
నిలువెత్తు నిదర్శనాలు చూపి -కనువిప్పులు కలిగించావు

స్వార్థం వీడమని సంకేతించి - సంస్కరించి సద్గురువయ్యావు
సర్వాంతర్యామిగా సంచరించి-సంపదలతో సాదరించావు

సర్వస్య శరణాగతి శ్రేష్టమని - దాసోహమే సర్వోత్క్రుష్టమని 
సంశయాలను పారద్రోలి - సంకల్పముతో నిలిపావు 

సాధ్యమైనంతలో కాదు లేదు అనకుండా-సాటి వారిని ఆదుకొమ్మని 
సహేతుకమైన సాక్ష్యాలిచ్చి - సర్వామోదం పొందావు 

బాధలన్ని  సంక్షయం చేసి - భక్తుల కొరకే బ్రతికావు
భక్తి ఓపికలు సడలకుండా - నడవడిని నియంత్రించు బాబా 

సాయి స్మరణ పునశ్చరనే- సదా సద్గతికి మార్గమని 
అంతర్ముఖులను గావించి- ముక్తి మార్గం చూపావు 




No comments:

Post a Comment