Saturday, July 30, 2011

ఎన్ టి పి సి ముప్పదేళ్ళ మహొత్సవం

డెబ్బై ఐదవ సంవత్సరాన   నవంబెరేడవ తేదీన 
ఉద్భవించిన ఎన్ టి పి సి కి  ముప్పదేళ్ళ మహొత్సవం 

మురిపమైన మన ఎన్ టి పి సి ముప్పదేల్లు నిండినవి 
మన ముద్దు ముచ్చట తీర్చుతూ -తాను తల్లిగ ఎదిగినది 

గాడాంధకార తిమిరములో - జ్యోతి కిరణమై నిలిచినది 
జాబిలి వెలుగులు నింపి తాను- జాతి విలువనే పెంచినది

భారతాన ఆనాడు- వెలుగుల సంస్థగ వచ్చింది 
నలు దిశల దేశాన - జాబిలి వెలుగులు నింపింది 

వేల మంది ఉద్యోగులతో - మేఘవాట్ల ఉత్పత్తులతో 
విఫణి వీధిలోమనిరత్నమై-నవ రత్నాలలో ఒకటయ్యింది 

అనేకానేక  మైలు రాళ్ళను - అధిగమిస్తూ వచ్చింది 
అంచెలంచెలుగా ఎదిగినది-జ్యోతి కిరణమై వెలసింది 

ఉత్పత్తిలోన గణనీయం -ఉన్నత శిఖరం మా గమ్యం 
మహా రత్నాలలో తానొకటై- కలికి తురాయిగా మెప్పింది 

స్పష్టమైన దృక్పథంతో - సుసాధ్యమైన లక్ష్యాలతో 
మౌలిక విలువలు పాటిస్తూ - మానవీయతను అనుసరించెను 


పరి శుభ్రతలను పాటిస్తూ - పర్యావరణం పదిలపరుస్తూ 
నవ్య సాంకేతికతకు సమాహారమై-నాణ్యతకేమో పట్టం కట్టెను


పల్లె రైతులకు పచ్చదనంగా - అన్నపూర్ణను అందించింది 
పరిశ్రమలకు పట్టుకొమ్మగా- ప్రగతి బాటను చూపింది 


అవార్డులెన్నో గెలిచింది -రివార్డులెన్నో తెచ్చింది 
రికార్డులన్నీ అధిగమిస్తూ - ఖ్యాతి కీర్తులే నిలిపింది


జాతి కీర్తిని ఇనుమడిస్తూ-జగతిన తానై ఎగసింది 
మాతృమూర్తిగా నిలిచింది-మమతలు తానై పంచింది 








No comments:

Post a Comment