Wednesday, August 3, 2011

సాంప్రదాయేతర ఇంధనాలు

ఆటవికమైయన ఆకారాలకు - ఆవాసాలే లేని అనాగరికులకు
నిలకడ లేని నియాండ ర్తల్లకు - చరిత్రనిచ్చింది  చక్రం పనిముట్లయితే 

రాకాసి బొగ్గు, రైలింజన్లు -రవాణా సాధనాలు ,రాకెట్లు 
మైలు రాళ్ళు గ నిలిచాయి - మానవాళి జీవితాన 

రక రకాల  ఇంధనాలు - రమ్యమైన సాధనాలు 
రంగు రంగుల జీవితాలనిచ్చి-రక్తి కట్టించాయి మానవాళిని 

ఇంధనాలు ప్రకృతి వరమైతే - పరిమితమన్నది పచ్చినిజం 
పొంచి ఉన్నది ప్రమాదం- పరికించు నగ్న సత్యం 

ఇంధనాలు లేని రోజు - ఇక్కట్లే మానవాళికి 
కలలు చెదరక ముందే - కళ్ళు తెరువు సోదరా 

శోధించు సాంప్రదాయేతర ఇంధనాలు - సాధించు తరగని చెరగని నిల్వలు 
ప్రభలమైన మార్పు కొరకు - ప్రతిన బూని పయనిద్దాం 

No comments:

Post a Comment