1. అన్నదమ్ముల
అనుబంధం
అమ్మ తనువు చీల్చుకుని మనమంతా
అన్నదమ్ములు
- అక్కచెల్లెళ్లుగా పుడుతాము
కన్న తల్లి పాలను కల్సి
మెల్సి తాగుతాము
రక్త మాంసాలను రంగరించి పంచుకుంటాము
తండ్రి తనువు అణువణువున నిలిపి
తపిస్తుంది
తన పిల్లల పెంపుకై
తండ్రి మార్గ దర్శకములో మనమంతా
తడబడకుండా
అడుగులేసి నిలుస్తాము
అన్నయ్యల ఆలంబన, ఆప్యాయతలు
తమ్ముళ్లకు
భలే బలమై నిలుస్తాయి
తమ్ముళ్ల చిలిపి చిలిపి చేష్టలు
అన్నయ్యలకు
కమ్మనైన ఆనందాలు
అన్నలంటే తమ్ముళ్లకు ఎనలేని గౌరవముంటే
తమ్ముళ్ళంటే
అన్నలకు అనురాగమే మరి
అదేకదా కొలమానం అన్నదమ్ముల అనుబంధానికి
అది చూస్తే కలుగదా తల్లి
తండ్రులకు ఆనందం
అవిభాజ్య కుటుంబాల సందళ్ళతో
ఆదరువే ఒకరికొకరు ప్రతీ కృత్యమునందు
ఆ బంధం ఆస్వాదిస్తే అవుతుంది
ద్విగుణీకృతం.
అజరామరం కాదా ఇక అన్నదమ్ముల అనుబంధం
2. మిత్ర
బంధం
రక రకాల మన రక్త
సంబంధాలన్నీ
రుధిర సంబంధ నారాయణ లీలలు
తాతలు ముత్తాతలు మొదలుకుని
మనుమలు మనుమరాండ్ర వరకు
బాల్య మిత్రులెందరితోనో భలే సరదా
చేసినా
బ్రతుకు గమ్యములో మాత్రం
బంధమై నిలిచే మిత్రులనెంచుకునే
భవిష్యత్తు
మనిషి చేతుల్లో ఉన్నది
సుద్ది బుద్దులు నేర్చిన తదుపరి
ఏర్పడే
సుమిత్ర బంధం బలముగ నిలుస్తుంది
కష్ట సుఖాలలో కల కాలం
తోడు నీడై
కదం కలిపి నడచినవాడే అసలు
సిసలు మిత్రుడు.
ప్రత్యక్షంగా
గాని, పరోక్షంగాగాని
ప్రతి మిత్రునికి మంచి చేయక
పోయినా
పదిమంది చెడులు ఏ మిత్రునికి
అంటనీయని వాడే
పరమ శ్రేష్ఠ మిత్ర బంధానికి
సంకేతం
తనువులు వేరైనా (తమస్సు)ఆత్మ ఒకటిగా
నిలుస్తుంది.
3. ఆత్మ
బంధువు
హరి లీలన అంకురించేది జన్మ
బంధం,
ఏరి కోరి ఎంచుకునేది మిత్ర బంధమైతే
ఏదో
తెలియని పాశ బంధముతో
ఎదురొచ్చి
నిలిచేది ఆత్మ బంధువు
ఉచ్వాస , నిచ్వాస లలో సైతం
ఉనికిని పసికడ్తూ సదా కనిపెట్టుకుని
ఉన్నంత సేపు ఇతరులకు ఊతమిస్తూ
సదా క్షేమం కోరేదే సాక్షాత్తు
ఆత్మ బంధువు .
ఆది తెలియక , అంతు చిక్కక
పోయినా
అడగక ముందే అన్నీ అమర్చేదే
అక్షయమై నిలుస్తుంది ఆత్మ బంధుత్వం
అజరామరమౌతుంది
ఆ బంధుత్వం .
No comments:
Post a Comment