ఉషోదయపు వేకువనే
పక్షుల కిల కిలా
రవములకు
ఉసి కొలిపేదే కవిత్వం
పసి వాడని చిన్నారుల బోసినవ్వుల్లో
వసి వాడని పువ్వులై
పూయునది కవిత్వం
కొంగ్రొత్త
పొలములలో
అంకురమై నిలిచే బీజ దళాల్లో
పచ్చని చేలయ్యేదే కవిత్వం
మంచి మనసున పలికే
అంతులేని హృదయ ఘోషకు
ఇంకి పోనీ సిరాయే కవిత్వం
సామాజిక అసమానతలపై
ఎక్కుపెట్టిన
పోరు జెండా
అజెండాయే కవిత్వం
రైతు ఆత్మ గౌరవానికి
శశి కాంతుల సేద్యములో పులకించే
పచ్చని ప్రకృతి కవిత్వం
అహోరాత్రులు
అలుపెరుగక
ఆ సరిహద్దుల్లో పహారా కాస్తున్న
వీర జవాన్లది - ధీర కవిత్వం.
No comments:
Post a Comment